మళ్లీ చైనాను చుట్టేస్తున్న కరోనా
చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకూ 56 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి
చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకూ 56 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నెల రోజుల్లోనే కరోనా కారణంగా చైనాలో 200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నిత్యం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
డైనమిక్ జీరో.....
దీంతో ప్రభుత్వం డైనమిక్ జీరో లక్ష్యంతో పనిచేస్తుంది. కోవిడ్ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం మరింత పెంచింది. ట్రేసింగ్ ద్వారా త్వరలోనే జీరో స్థాయికి కేసులు తీసుకువస్తామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేశారు. ఒక్కసారి ఆంక్షలు విధించకుండా పరీక్షలు, చికిత్స ద్వారా కేసుల సంఖ్యను తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారు.