భారత్ అంతగా సహాయం చేస్తున్నా.. శ్రీలంక తన బుద్ధి మార్చుకోలేదుగా..?
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను ఉపయోగిస్తుంది. శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ ఎంతో సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే..! భారత్ శ్రీలంక ప్రజల ఆకలిని తీర్చడానికి తనవంతుగా సహాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారవడానికి కారణం చైనాతో చేసిన సహవాసమే అని కూడా అంటారు. ఇంత జరుగుతున్నా కూడా భారత్ ను కాదని శ్రీలంక తన బుద్ధిని చూపించింది. భారత్ అభ్యంతరం చెప్పినా కూడా చైనా నిఘా పడవకు శ్రీలంక అనుమతించింది. త్వరలోనే చైనా స్పై షిప్ శ్రీలంక పోర్టుకు చేరనుంది. హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యాన్ని చూపించడానికి.. యువాన్ వాంగ్ 5 పడవను తీసుకుని వస్తున్నారు. స్పేస్, శాటిలైట్‌ల ట్రాకింగ్ కోసం దీన్ని పంపుతున్నారనే సందేహాలు వస్తున్నాయి.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను ఉపయోగిస్తుంది. శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు ఈ షిప్ రావడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది. ఆ షిప్‌ను అనుతించవద్దని శ్రీలంకకు సూచించింది. ఈ షిప్ ఆగస్టు 11వ తేదీనే రావల్సింది. భారత్ సూచనల మేరకు శ్రీలంక అనుమతులు ఇవ్వలేదు. తాజాగా, మళ్లీ ఆ షిప్‌కు అనుమతి ఇచ్చింది. శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఈ నెల 16 నుంచి 22 మధ్య రావడానికి అనుమతి ఇచ్చింది. తమకు డిప్లమాటిక్ క్లియరెన్స్ వచ్చిందని శ్రీలంక అధికారులు చెప్పారు. ఈ షిప్ భారత కార్యకలాపాలు, భారత మిలిటరీ కేంద్రాలు సహా పలు అంశాలపై నిఘా వేసే అవకాశం ఉందని భారత్ ఆరోపిస్తోంది. భారత్ తన ఆందోళనలను ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలియజేసిందని, ఆ నౌకను ఎందుకు అనుమతించకూడదో సరైన కారణాలు చెప్పడంలో భారత్ విఫలమైందని శ్రీలంక పేర్కొంది. ఆగస్టు 16 నాటికి యువాన్ వాంగ్-5 నౌక హంబన్ టోట పోర్టుకు రానున్నట్టు చైనా దౌత్యకార్యాలయం నుంచి సమాచారం అందిందని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.