మాల్దీవుల్లో రాజపక్స
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు.;
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. శ్రీలంక నుంచి ఆయన సైనిక విమానంలో పదిహేను మందితో వెళ్లిపోయారని అధికారులు ధృవీకరించారు. సైనిక విమానంలో మాల్దీవుల రాజధాని మేల్ కు ఆయన వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు అక్కడి ప్రభుత్వం స్వాగతం చెప్పింది. అయితే తాను సురక్షితంగా దేశం విడిచి వెళ్లిపోయేందుకు అనుమతిస్తేనే పదవికి రాజీనామా చేస్తానని గొటబాయి రాజపక్సే స్పష్టం చేసినట్లు తెలిసింది.
రాజీనామా చేయకుండా...
రాజీనామా చేయకుండా గొటబాయ దేశం విడిచి పారిపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు స్పీకర్ ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబ సభ్యులతో సోమవారమే 15 మందితో గొటబాయ శ్రీలంకను వీడేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన బుధవారం తెల్లవారు జామున ఆయన వాయుసేన విమానంలో పారిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో గొటబాయ తలదాచుకున్నారు.