చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది మృతి

మొన్వోరియా శివారులోని న్యూ క్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద బుధవారం రాత్రి ఓ వేడుక నిర్వహించారు.

Update: 2022-01-21 05:25 GMT

లైబీరియా రాజధాని మొనోర్వియాలోని ఓ చర్చిలో విషాదం నెలకొంది. చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మొన్వోరియా శివారులోని న్యూ క్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద బుధవారం రాత్రి ఓ వేడుక నిర్వహించారు. ఆ వేడుకలోకి ఓ దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు.

Also Read : కరోనా విలయం.. ఇకపై వారాంతపు లాక్ డౌన్!

దోపిడీ ముఠాను చూసి.. అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో చర్చిలో తొక్కిసలాట జరిగింది. కొందరు కిందపడిపోగా.. వారిని తొక్కుకుంటూ పలువురు పరుగులు తీశారు. దాంతో 29 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News