ఇక ఆడేది లేనట్లే.. రెండోసారి వీసా రద్దు

టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. రెండోసారి వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2022-01-14 08:39 GMT

టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. రెండోసారి వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల పాటు జకోవిచ్ పై నిషేధాన్ని విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడేందుకు నిరాకరించినట్లే. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ పై ఈ చర్యకు దిగింది.

మూడేళ్ల నిషేధం....
ఒకసారి జకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై జకోవిచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం జకోవిచ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ మరోసారి వీసాను రద్దు చేయడంతో ఆయనకు ఇక ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడే ఛాన్స్ లేకుండా పోయింది. 21వ గ్రాండ్ శ్లామ్ ను సాధించాలన్న జకోవిచ్ కోరిక నెరవేరే అవకాశం లేకుండా పోయింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ తీసుకోనందునే జకోవిచ్ వీసాను రద్దు చేస్తూ, మూడేళ్ల పాటు నిషేధం విధించామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News