Earthquake : అమెరికాలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
అమెరికాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 4.8 తీవ్రతగా నమోయదయింది.
అమెరికాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 4.8 తీవ్రతగా నమోయదయింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. యూఎస్ జియోలాజికల్ స్వే ఈ మేరకు వెల్లడించింది. అయితే వైట్ హౌస్ కు స్టేషన్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలాలనికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు.
బయటకు పరుగులు...
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధఇకారులు తెలిపారు. భూకంపం తీవ్రతకు ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. బయటకు పరుగులు తీశారు. కానీ కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి వెంటనే సాధారణ స్థితికి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో భూప్రకంపనలు కొంత అలజడిని సృష్టించాయి.