Japan : భూకంపం దెబ్బకు ఎంత మంది మృతి చెందారంటే?
జపాన్ లో భూకంపం కారణంగా పదమూడు మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది
జపాన్ లో భూకంపం కారణంగా పదమూడు మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సోమవారం సంభవించిన వరస భూకంపాలతో జపాన్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పదమూడు మంది ఇప్పటి వరకూ మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువగా జపాన్ దేశంలోని ఇషికావాలోనే ఎక్కువ మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆస్తి నష్టమూ...
మరోవైపు జపాన్ లో భూకంపం కారణంగా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. వీలయినంత వరకూ సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని చెబుతున్నారు. మరోసారి భూప్రకంపనలు సంభవించే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే జరిగినట్లు భావిస్తుంది. అయితే ఆస్తినష్టం ఎంతన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టం కావడంతో పెద్దయెత్తున ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.