టోర్నడోలు.. అమెరికాలో భయం.. భయం
అమెరికాలో టోర్నడోలు భయాందోళనలను కల్గిస్తున్నాయి. టోర్నడోల కారణంగా ఇప్పటికే 70 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
అమెరికాలో టోర్నడోలు భయాందోళనలను కల్గిస్తున్నాయి. టోర్నడోల కారణంగా ఇప్పటికే 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీ కార్మికులు మృత్యువాత పడ్డారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావం కన్పిస్తుంది. దీంతో అక్కడ ఎమెర్జెన్సీని ప్రకటించారు. కెంటకీ లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. టోర్నడోల ప్రభావం 227 మైళ్ల వరకూ కన్పించడంతో విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేశారు.
ఐదు రాష్ట్రాల్లో....
వీటి ప్రభావం మరికొద్దిరోజులు ఉంటుదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తిరిగి ప్రకటన చేసేంత వరకూ ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు రావద్దని సూచిస్తున్నారు. మొత్తం మీద టోర్నడోల ప్రభావంతో అమెరికాలోని ఐదు రాష్ట్రాలు వణుకుతున్నాయి.