ట్రుడు ద్వంద్వ రీతి

ఇక్కడున్న మూడు రోజులు భారత ఆతిథ్యం స్వీకరించి.. ద్వంద్వ రీతని ప్రదర్శించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విమర్షలను ఎదుర్కొంటున్నాడు‌.

Update: 2023-09-13 09:57 GMT

ఇక్కడున్న మూడు రోజులు భారత ఆతిథ్యం స్వీకరించి.. ద్వంద్వ రీతని ప్రదర్శించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విమర్షలను ఎదుర్కొంటున్నాడు‌. భారత్‌లో G20 లో ఉండగానే‌.. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదుల ర్యాలీలకి అనుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాడు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ ఆరోజు మోడీ, దోవల్, అమిత్ షా లను బహిరంగంగానే బెదిరించాడు. కెనడాలోని భారత రాయబార కేంద్రం పై ఇప్పటివరకూ ఖలిస్తానీలు చాలాసార్లు దాడులు చేసారు. భారత రాయబారులను బెదిరించుకుంటూ ర్యాలీలు తీస్తారు.

మన దేశంతో ద్యౌత్య సంబంధాల బలోపేతం కోసం జీ 20 సదస్సులో మాట్లాడిన ట్రుడు.‌‌. అదే సమయంలో వాళ్ల దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు తాము అడ్డుపడమని చెప్పి ఖలిస్తానీ సింపతైజర్ కోణాన్ని చెప్పకనే చెప్పేశాడు‌. అతను మాట్లాడిన తర్వాత కెనడాలోని ప్రతిపక్షాలతో పాటు ఎన్నో దేశాలు ట్రుడు తీరుని విమర్షించాయి. అక్కడ మీడియా కూడా అతనిని కడిగి పారేయడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్న ట్రుడు #G20Summit ముగిసి ఒకరోజు గడిచిన తర్వాత కూడా ట్రుడు కెనడాకు తిరిగి వెళ్ళడానికి జంకుతున్నాడు. విమానంలో సాంకేతిక లోపాల కారణం అంటూ తన ప్రయాణాన్ని నిన్న సాయంత్రం దాకా వాయిదా వేసుకున్నాడు.

Tags:    

Similar News