జీతం ఇవ్వలేదని మంత్రిని కాల్చి చంపి.. గార్డు ఆత్మహత్య
కాగా.. సబిజిత్ ను నెలరోజుల క్రితమే మంత్రి సెక్యూరిటీగా నియమించారు. వేతనం చెల్లించకపోవడమే ఈ ఘటనకు..
జీతం ఇవ్వలేదన్న కోపంతో మంత్రిని కాల్చి చంపి.. ఆపై తనను తాను కాల్చుకుని గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉగాండా దేశంలో జరిగింది. చనిపోయిన మంత్రి ఉగాండాకు కార్మికశాఖ సహాయమంత్రిగా ఉన్న రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలా. మంత్రిని చంపిన గార్డు విల్సన్ సబిజిత్. ఉగాండా రాజధాని కంపాలాలోని మంత్రి నివాసంలో.. మంగళవారం జరిగిందీ ఘటన. మంత్రిని కాల్చిన అనంతరం సబిజిత్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా.. సబిజిత్ ను నెలరోజుల క్రితమే మంత్రి సెక్యూరిటీగా నియమించారు. వేతనం చెల్లించకపోవడమే ఈ ఘటనకు కారణమా ? మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే.. సబిజిత్ ఆత్మహత్యకు ముందు ఆ చుట్టుపక్కల కాసేపు తచ్చాడాడని, ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో మంత్రి సహాయకుడు రొనాల్డో ఒటిమ్ గాయపడ్డారు. మరికొందరికి కూడా గాయలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.