ఇకపై ఆ దేశంలో సెన్సార్ లేదు.. సినిమా ఎలాతీస్తే అలానే విడుదల
ఇప్పటివరకూ యూఏఈ లో విడుదలైన సినిమాల్లో నగ్నత్వం, స్వలింగ సంపర్కం, లైంగిక దృశ్యాలు ఉన్న సినిమాలను సెన్సార్ చేశేవారు. ఇప్పుడు సెన్సార్
ఇకపై వచ్చే సినిమాలపై సెన్సార్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్ (యూఏఈ). విదేశీయులను ఆకట్టుకునేందుకు పలు అంశాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్న యూఏఈ.. ఇప్పుడు సినిమాలపై సెన్సార్ ను పూర్తిగా ఎత్తివేసినట్లు ప్రకటించింది. అక్కడున్న జనాభాలో 90 శాతం మంది ప్రవాసులే కావడం ఇందుకు ముఖ్యకారణం. అంతర్జాతీయ చిత్రాలు అధికంగా విడుదలవుతుంటాయి. ఇప్పటివరకూ యూఏఈ లో విడుదలైన సినిమాల్లో నగ్నత్వం, స్వలింగ సంపర్కం, లైంగిక దృశ్యాలు ఉన్న సినిమాలను సెన్సార్ చేశేవారు. ఇప్పుడు సెన్సార్ ఉండబోదంటూ యూఏఈ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఇకపై అంతర్జాతీయ చిత్రాలను యథాతథంగానే థియేటర్లలో విడుదల చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంప్రదాయిక ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే అంశాలను సినిమాల నుంచి తొలగించే బదులుగా '21 ప్లస్' అనే కొత్త వయోవర్గాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఎమిరేట్ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. యూఏఈ థియేటర్లలో అంతర్జాతీయ సినిమాలను యథాతథంగా ప్రదర్శించవచ్చని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాదు.. 2022 నుంచి ప్రతి శుక్రవారానికి బదులుగా శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా అమలు చేయనుంది యూఏఈ. ఇదంతా ప్రవాసులను ఆకట్టుకునేందుకే చేస్తోందనడంలో సందేహం లేదు.