ఒత్తిడి పెరుగుతోంది.. ఆస్పత్రుల్లో బెడ్లు రెడీ చేసుకోండి : డబ్ల్యూహెచ్ఓ

రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదవుతుండటంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఒత్తిని తట్టుకోవాలంటే

Update: 2021-12-19 09:18 GMT

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మొత్తం 89 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఒకరికి ఒమిక్రాన్ సోకితే.. ఆ వ్యక్తి నుంచి రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదవుతుండటంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఒత్తిని తట్టుకోవాలంటే.. ముందుగానే ఆస్పత్రుల్లో బెడ్లను రెడీగా పెట్టుకోవాలని సూచించింది.

వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టండి
ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినా.. కేసులు పెరిగే కొద్దీ ప్రమాదం పెరిగినట్లేనని చెప్తోంది డబ్ల్యూహెచ్ఓ. అలాగే ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలు బూస్టర్ డోస్ ప్రక్రియను అవలంబించక తప్పదని, ఈ అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. ఇప్పటికే బూస్టర్ డోస్ లు కంప్లీట్ చేసిన దేశాలు పేద దేశాలకు టీకాలు పంపిణీ చేసి, ఆదుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.




Tags:    

Similar News