హై హీల్స్ తో తాడుపై జంప్.. మహిళ గిన్నిస్ రికార్డు

ఓ మహిళ హై హీల్స్ వేసుకుని ఏకంగా తాడుపై జంప్ చేసింది. ఆ జంప్ తో.. దెబ్బకి గిన్నీస్ రికార్డు సాధించింది. వివరాల్లోకి వెళ్తే..

Update: 2022-02-23 08:33 GMT

కాలిఫోర్నియా : రిచ్ లుక్ కోసం చాలామంది హై హీల్స్ వాడుతుంటారు. కానీ.. అవి వేసుకుని నడవటం చాలా కష్టం. చాలామంది హై హీల్స్ వేసుకుని నడవటం ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి మేనేజ్ చేయలేక పడిపోతుంటారు కూడా. కానీ ఓ మహిళ హై హీల్స్ వేసుకుని ఏకంగా తాడుపై జంప్ చేసింది. ఆ జంప్ తో.. దెబ్బకి గిన్నీస్ రికార్డు సాధించింది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓగ్లీ హెన్రీ అనే మహిళా అథ్లెట్ ఈ అరుదైన రికార్డును సాధించింది. అక్కడి సాంటా మోనికా బీచ్ లో ఈ స్టంట్ చేసి.. అందరినీ అబ్బురపరిచింది హెన్రీ. గాల్లో కట్టిన తాడుపై జంప్ చేసింది. అదికూడి ఒక్క నిమిషంలో 25 సార్లు కిందపడకుండా జంప్స్ చేయడం అంటే మాటలు కాదు. ఆ వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News