వణికిస్తున్న వేరియంట్.. డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిక

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2021-12-15 03:38 GMT

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పదమూడు వేలకు దాటాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కేసులు పెరిగే కొద్ది మరణాలు పెరుగుతాయని హెచ్చరించింది. కోవిడ్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

77 దేశాలకు....
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది. దాదాపు 77 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించడం ఆందోళన కల్గిస్తుంది. సౌతాఫ్రికాలో మొదలయిన ఈ వేరియంట్ అన్ని దేశాలను చుట్టేస్తుంది. ఎన్ని ఆంక్షలను విధించినా వేరియంట్ ను అదుపుచేయలేక పోతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు సూచనలు చేసింది.


Tags:    

Similar News