కృతి సనన్, రష్మిక లకు ఛాన్స్ దొరకగానే చేసే పని ఇదట..!

కృతి సనన్, రష్మిక లకు ఛాన్స్ దొరకగానే చేసే పని;

Update: 2022-08-03 11:16 GMT

సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ సాహ్నీ బాలీవుడ్ నటి కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వర్కౌట్ సెషన్‌ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్టోరీలో ఓ వీడియోను పంచుకున్నారు. ట్రైనింగ్ సమయంలో కాస్త సమయం ఇస్తే ఇలా మాటలు పెట్టుకుంటారు ఇద్దరూ అని కృతి సనన్, రష్మిక మందన్న గురించి చెప్పుకొచ్చారు. "నేను కాస్త గ్యాప్ ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది" అని క్యాప్షన్ లో చెప్పారు. కృతి సనన్, రష్మిక మందన్నలు జిమ్ సెషన్ లో కాస్త గ్యాప్ దొరకగానే మాటలు చెప్పుకుంటూ కూర్చుకున్నారు." "This is what happens when I give Kriti Sanon and Rashmika Mandanna some time off." ఈ వీడియోపై రష్మిక స్పందిస్తూ, "కృతి సనన్ నేను ప్రపంచం లోని సమస్యల గురించి చర్చిస్తున్నాం.. డిస్టర్బ్ చేయవద్దు" అని లాఫింగ్ ఈమోజీలను పోస్టు చేసింది. వీడియో పోస్ట్ చేసిన వెంటనే, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు హీరోయిన్ల మధ్య బంధాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

కృతి సనన్ భారీ సినిమాలను ప్రస్తుతం లైన్ లో పెట్టింది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సరసన `ఆదిపురుష్` లో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి `గణపథ్` లో నటిస్తోంది. 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల కావలసి ఉంది. ఫిబ్రవరి 10, 2023న `షెహజాదా` సినిమా విడుదల కాబోతోంది. వరుస హిట్స్ మీద ఉన్న కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తోంది. ఇది అల.. వైకుంఠపురంలో సినిమా రీమేక్. ఇక వరుణ్ ధావన్- అనురాగ్ కశ్యప్‌ సినిమాలో కూడా నటించనుంది.
రష్మిక, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లతో కలిసి పాన్-ఇండియా చిత్రం `సీతా రామం`లో నటించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మిషన్ మజ్ను`, అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై', రణబీర్ కపూర్‌తో `యానిమల్`లో కూడా రష్మిక కనిపించబోతోంది.


Similar News