ఒకేరోజు ఏకంగా 11 సినిమాలు ఓటీటీల్లో విడుదల

పెద్ద సినిమాలు విడుదలైతే... చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ మధ్య చాలా..

Update: 2022-09-23 12:07 GMT

ఒకప్పుడు థియేటర్లలో వారానికి ఒక సినిమానే వచ్చేది. ఆ తర్వాత రెండు.. క్రమంగా వారానికి ఐదు నుంచి 10 సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలు విడుదలైతే... చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ మధ్య చాలా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. వాటితో పాటు థియేటర్లలో బోల్తా పడిన సినిమాలు నెలరోజుల్లోపే ఓటీటీ బాటపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు పలు ఓటీటీల్లో ఏకంగా 11 సినిమాలు విడుదలయ్యాయి. ఇది చూస్తుంటే.. థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్ అనుకుంటున్నారు ప్రేక్షకులు.

1.లైగర్ : పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ -అనన్య పాండే కాంబినేషన్లో బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక థియేటర్ల నుంచి వెనుదిరిగింది. డిస్నీ+హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
2.కళాపురం : 'పలాస' 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నేటి నుంచి జీ5 లో స్ట్రీమ్ అవుతోంది.
3.తిరు( తిరుచిత్రామ్బలం) :
ధనుష్ హీరోగా నిత్యా మేనన్, రాశీ ఖన్నా లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ లో ఉంది.
4.డైరీ : సస్పెన్స్ మిస్టరీగా తెరకెక్కిన ఈ తమిళ్ మూవీ నేటి నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.
5.ఫస్ట్ డే ఫస్ట్ షో : 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కథ, డైలాగ్స్ రాసిన ఈ మూవీ కూడా నేటి నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.
6.జంతరా : సబ్ కా నెంబర్ ఆయేగా సీజన్ 2 : ఈ హిందీ వెబ్ సిరీస్ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
7.బబ్లీ బౌన్సర్ : తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఒక అమ్మాయి బౌన్సర్ అయితే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా కథ.
8.హుష్ హుష్ : ఈ హిందీ సిరీస్ నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
9.ఎల్.వో.యు : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
10.ది కర్షషియన్స్ సీజన్ 2 : సెప్టెంబర్ 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
11.అతిథి భూతొ భవ : ఈ హిందీ మూవీ నిన్నటి నుంచి జీ5 లో స్ట్రీమింగ్ లో ఉంది.




Tags:    

Similar News