ఆ సూపర్ హిట్ సినిమాను తెలుగులో చూసేయండి.. ఇంకెందుకు ఆలస్యం

విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో;

Update: 2024-03-05 02:36 GMT

12త్ ఫెయిల్ సినిమా.. ఎంతో మంది విద్యార్థులకు ఓ ఇన్స్పిరేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలోనూ మంచి విజయం సాధించగా.. ఓటీటీలోకి వచ్చాక మంచి రీచ్ లభించింది. ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా తెలుగులో రాకపోవడంతో అప్పట్లో కొద్దిగా బాధగా అనిపిస్తోందని పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. గత అక్టోబరులో థియేటర్లలో విడుదలైంది.. మనోజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి సివిల్స్ ను సాధించాలనే సంకల్పంతో చేసిన సాహసం ఈ సినిమా. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో పేదరికం, కష్టాలను దాటి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడనేది చూపిస్తారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే లీడ్ రోల్ లో నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ డిసెంబర్ నుండి హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండగా.. ప్రాంతీయ భాషల ఎంపికలు లేకపోవడం వల్ల దక్షిణ భారత ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు "12త్ ఫెయిల్" తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. స్థానిక భాషలో ఈ సినిమాను చూడాలని అనుకునే వాళ్లకు ఇదొక గుడ్ న్యూస్.


Tags:    

Similar News