చిరు – కొరటాల సినిమా ఎలా ఉండబోతుంది

త్వరలోనే కొరటాల డైరెక్షన్ లో చిరు 152 వ చిత్రం చేయనున్నాడు. కొరటాల – చిరంజీవి కాంబినేషన్ అనగానే ఇదొక పక్క కమర్షియల్ సినిమా అని అర్ధం [more]

Update: 2019-10-16 09:00 GMT

త్వరలోనే కొరటాల డైరెక్షన్ లో చిరు 152 వ చిత్రం చేయనున్నాడు. కొరటాల – చిరంజీవి కాంబినేషన్ అనగానే ఇదొక పక్క కమర్షియల్ సినిమా అని అర్ధం అయిపోతుంది. ఎప్పటి నుంచో చిరు అభిమానులు చిరు కమర్షియల్ సినిమా చేస్తే చూడాలి అనుకుంటున్నారు. అది ఈ సినిమాతో తీరిపోనుంది. చిరు, కొరటాల బలబలాలను బట్టి మనం కూడా వీరి సినిమాలో ఉండబోయే అంశాలు, ఉండని అంశాలు ఏమిటో చూద్దాం.

చిరు ఫ్యాన్స్ కోరిక తీరేనా…..?

ముందుగా చిరు ఫ్యాన్స్ కోరుకునేది హీరో ఎలివేషన్స్. ఈ విషయానికి వస్తే కొరటాల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు. కొరటాల సినిమా అంటే ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. సో ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కి దిగులు లేదు. ఇక చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తారు. డ్యాన్సులు లేందే చిరు సినిమా ఒప్పుకోరు. సో ఇది కూడా ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఉండబోతుంది. ఇక మరొకటి చిరు కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల సినిమాలు అంటే కామెడీ అసలు ఉండదు. అతని సినిమాల్లో హీరోస్ అంతా ఏదో సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు. సో ఈమూవీలో ఫ్యాన్స్ కామెడీ ని పెద్దగా ఎక్స్ పెక్ట్ చేసుకోవద్దు. ఇక లాస్ట్ గా చిరు సోషల్ మెసేజ్ ఇస్తే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమాతో అది కూడా తీరిపోనుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని అర్ధం అయిపోతుంది. నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది

 

 

Tags:    

Similar News