అయ్య బాబోయ్ 600 కోట్లా..?

Update: 2018-11-03 09:56 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ నేడు ట్రైలర్ లాంచ్ వేడుక అంగరంగ వైభవంగా చెన్నై లో జరిగింది. ఈ వేడుకలో అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఇక 2.ఓ ట్రైలర్ మొత్తం గాఫిక్స్ మాయాజాలమే. శంకర్ దర్శకత్వం సినిమాకే హైలెట్ అంటే... విజువల్ ఎఫెక్ట్ ఆ దర్శకత్వాన్ని ఛాలెంజ్ చేసేలా కనబడుతుంది. ఇక ఈ సినిమాకి 400 నుండి 450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకి 400 లు 450 కోట్ల పెట్టుబడి కాదు ఏకంగా 600 కోట్ల పెట్టుబడిని లైకా అధినేతలు పెట్టారట.

వేదిక మీదే చెప్పిన రజనీకాంత్

ఆ విషయం 2.ఓ ట్రైలర్ లాంచ్ వేడుక మీద లైకా అధినేతలతో పాటుగా.. రజనీకాంత్ స్వయంగా చెప్పాడు. లైకా అధినేతలు తామెంత పెట్టుబడి పెట్టినా ఒక మంచి చిత్రాన్ని నిర్మించామని శంకర్ దర్శకత్వాన్ని పొగిడేశారు. ఇక రజినీకాంత్ మాత్రం ముందు 2.ఓ సినిమాకి 450 కోట్ల పెట్టుబడి అనుకున్నాం కానీ అది 500 కోట్లు అయ్యింది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ మధ్యలో ఆపేసి మళ్లీ మొదలు పెట్టడంతో.. అది కాస్త 550 కోట్ల అయ్యింది. చివరికి 600 కోట్ల బడ్జెట్ రోబోకి పెట్టాల్సి వచ్చిందని చెప్పడంతో.. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారనేది ఒక క్లారిటీ వచ్చేసింది. మరి శంకర్ 600 కోట్ల బడ్జెట్ తో దేశం మెచ్చే సినిమా చేసాడని ఈ ట్రైలర్ ప్రూవ్ చేసేసింది. మరి 2.ఓ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలు, ఎన్ని రికార్డులు, ఎంత కలెక్షన్స్ నమోదు చేస్తుంది అనేది మాత్రం కాస్త ఈ నెలాఖరు వరకు వెయిట్ చేస్తే తేలిపోతుంది.

Similar News