2.ఓ కి క్రేజ్ ఉన్నట్టా...లేనట్టా..?

Update: 2018-11-22 07:59 GMT

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిన విషయమే. ఇక శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ నటిస్తున్నాడు అంటే.. ఆ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. తాజాగా శంకర్ - రజనీ కాంబోలో తెరకెక్కిన 2.ఓ మరో వారం రోజుల్లో అంటే వచ్చే గురువారమే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు ఉన్న క్రేజ్, హైప్ ఇప్పుడు విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రేక్షకుల్లో కలగడం లేదా? కలిగితే రోబో 2.ఓ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది సోషల్ మీడియాలోనే ఇంకేదన్న విధంగానే వారి ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేవారు. కానీ 2.ఓ విషయంలో అది పెద్దగా కనబడడం లేదు.

అంచనాలు పెరగకపోవడంతో...

ఈ సినిమా ట్రైలర్ తోనే సంచలనాలు నమోదు చేస్తుంది అంటే... బాహుబలి రేంజ్ సంచలనాలు నమోదు కాలేదు. మరి 600 కోట్ల బహు భారీగా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పుడున్న హైప్ మాత్రం సరిపోదు. మరేదో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని దుబాయ్ లో, ట్రైలర్ లాంచ్ చెన్నైలో ఘనంగా జరిపించిన లైకా వారు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో వెనక్కి తగ్గుతున్నారా.. లేదంటే దానికదే క్రేజ్ వచ్చేస్తుందిలే మనమెందుకు... ఈ సినిమాని ప్రమోట్ చెయ్యాలి అని అనుకున్నారా... ఏదైనా ప్రస్తుతం సినీ ప్రియుల్లో 2.ఓ మీద ఓ అన్నంత అంచనాలు అయితే కలగడం లేదు. హాలీవుడ్ రేంజ్ లో శంకర్ 2.ఓ ని తీర్చిదిద్దినా కానీ.. సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడడంతో హైప్ తగ్గిందో.. లేదంటే ప్రమోషన్స్ లో లోపమో అర్ధం కావడం లేదు.

ఈ హైప్ సరిపోతుందా..?

కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ మాత్రం హైప్ సరిపోదు. మరి ఈ సినిమా మీద ప్రస్తుతం ఉన్న హైప్ ని మరింతగా పెంచాల్సిన అవసరం అటు శంకర్, ఇటు రజనీ, నిర్మాతలపై ఎంతైనా ఉంది. ఏదో కౌంట్ డౌన్ పోస్టర్ తోనే సినిమాకి హైప్ అయితే వచ్చి పడదు. అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ఇలా భారీ తారాగణం నటించిన ఈ సినిమా భారీ హిట్ కొట్టాలి అంటే సినిమా మొదటి షోకే పాజిటీవ్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి. టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతల పని అవుట్.

Similar News