రజనీకాంత్ - శంకర్ భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ థియేటర్స్ లో దిగడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే గురువారమే విడుదలకు సిద్దమవుతున్న 2.ఓ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాదు... భారీ అంచనాలు కూడా ఉన్నాయి. శంకర్ - రజనీ కాంబో అంటేనే లెక్కలేనన్ని అంచనాలు ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ ఉంటాయి. ప్రస్తుతం మంచి ప్రీ రిలీజ్ జరుపుకున్న 2.ఓ నిర్మాతలకు అప్పుడే 370 కోట్లు వెనక్కి వచ్చేసాయి కూడా. ఎలా అంటే.. 2.ఓ అన్ని భాషల్లోనూ విడుదలవుతుంది కాబట్టి... అన్ని బాషల డిజిటల్ హక్కుల కింద 60కోట్లు, అలాగే అన్ని భాషల శాటిలైట్స్ హక్కుల కింద 120 కోట్లు రాబట్టారు.
తెలుగులో అయితే తిరుగులేదు...
అలాగే ఏపీ, తెలంగాణ లో 75 కోట్లు, ఉత్తరాది హక్కులకు 80 కోట్లు, కర్ణాటక, కేరళ కలిపి 40 కోట్లు ఇప్పటివరకు బిజినెస్ కింద నిర్మాతలు రాబట్టారు. మరి ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అంటే 2.ఓ సినిమా మొదటి వారంలో భారీగా కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఎంతగా ఓపెనింగ్స్ భారీగా రాబట్టినా... ఆ రేంజ్ పెట్టుబడిని వెనక్కి తేవడం అంత ఈజీ కాదు.. సినిమాకి హిట్ టాక్ పడినప్పటికీ.... మొదటి వారంలో, రెండో వారంలో సినిమాకి పెట్టిన పెట్టుబడి వెనక్కి తేవడం కాస్త కష్టసాధ్యమైన పనే. మరి 2.ఓ సినిమాకి ఎదురు నిలిచే సాహసం ఎవరికీ లేదు కానీ... తెలుగులో చిన్న చిన్న సినిమాలు వారానికొకటి చొప్పున విడుదలవుతున్నాయి కానీ డిసెంబర్ 21 వరకు మాత్రం చెప్పుకోదగిన చిత్రాలేమి లేవు. కనక తెలుగులో మరో మూడు వారాలు 2.ఓ కి ఎదురు లేదనే చెప్పాలి.
ఓవర్సీస్ లెక్క తేలితే...
ఇక ప్రస్తుతం ఇండియావైడ్ గా బిజినెస్ చేసిన 2.ఓ ఓవర్సీస్ లో ఎంత కొల్లగొట్టిందో నిర్మతలు లైకా వారు క్లారిటీ ఇవ్వలేదు. మరి అక్కడి నుండి ఎంత వచ్చిందో తెలిస్తే ఫైనల్ లెక్కలు తేలుతాయి. చూద్దాం 2.ఓ క్రేజ్ ఇది అని అందరికీ కనబడుతుంది కానీ విడుదలయ్యాక దాని రేంజ్ ఏంటనేది తెలుస్తుంది.