2023 Rewind : ఈ ఏడాది తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలివే..

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో హిట్ అయ్యిందేంటి..? ఫట్ అయ్యిందేంటి..?

Update: 2023-12-31 16:55 GMT
2023 Rewind : ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్.. వంటి స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్దకి ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాల్లో హిట్ అయ్యిందేంటి..? ఫట్ అయ్యిందేంటి..?
వీరసింహారెడ్డి..
బాలయ్యని మళ్ళీ వింటేజ్ లుక్ లో చూపిస్తూ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది.
వాల్తేరు వీరయ్య..
చిరంజీవి వింటేజ్ కామెడీని మరోసారి ఆడియన్స్ కి రుచి చూపించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. రవితేజ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం.. 210 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రైటర్ పద్మభూషణం..
సుహాస్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘రైటర్ పద్మభూషణం’. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
అమిగోస్..
కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
వినరో భాగ్యము విష్ణుకథ..
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ'.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సుమారు ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల పైనే కలెక్షన్స్ ని రాబట్టి హిట్ అనిపించుకుంది.
బలగం..
జబర్దస్త్ వేణు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతూ తెరకెక్కించిన ‘బలగం’ సినిమా.. కేవలం మూడు కోట్లతో రూపొంది 26 కోట్లకు పైగా వసూళ్లు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది.
దాస్ కా ధమ్కీ..
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. 22 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని హిట్ అనిపించుకుంది.
దసరా..
నానిని ఊర మాస్ క్యారెక్టర్ లో చూపిస్తూ తెరకెక్కిన చిత్రం 'దసరా'.. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. 65 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 117 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
రావణాసుర..
రవితేజ నెగటివ్ షెడ్ పాత్రలో కనిపిస్తూ తెరకెక్కిన రావణాసుర డిజాస్టర్ గా నిలిచింది.
శాకుంతలం..
సమంత నటించిన మైథలాజి చిత్రం శాకుంతలం కూడా డిజాస్టర్ గా నిలిచింది.
విరూపాక్ష..
సాయి ధరమ్ తేజ్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ మూవీ 'విరూపాక్ష'.. 103 కోట్ల వరకు రాబట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
ఏజెంట్, రామబాణం..
అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్', గోపిచంద్ నటించిన 'రామబాణం' గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఉగ్రం..
అల్లరి నరేష్ 'ఉగ్రం'.. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది.
కస్టడీ..
నాగచైతన్య తెలుగు తమిళ భాషల్లో బై లింగువల్ గా చేసిన కస్టడీ ప్లాప్ గా నిలిచింది.
మేమ్ ఫేమస్, పరేషాన్..
సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్', తిరువీర్ 'పరేషాన్'.. ఆడియన్స్ ని అలరించిన మంచి విజయానే అందుకున్నాయి.
ఆదిపురుష్..
ప్రభాస్ రాముడిగా నటిస్తూ కనిపించిన 'ఆదిపురుష్'.. హిట్ అవ్వడం కాదు కదా.. ఎన్నో విమర్శలు, వివాదాలకు దారి తీసింది.
స్పై..
సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంటూ వచ్చిన నిఖిల్ 'స్పై' ప్లాప్ అయ్యింది.
సామజవరగమన..
శ్రీవిష్ణు 'సామజవరగమన' ఆడియన్స్ ని అలరించి 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
బేబీ..
ఏ అంచనాలు లేకుండా చాలా సినిమాగా వచ్చిన 'బేబీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనలం సృష్టించింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 83 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బ్రో..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో'.. తమిళ చిత్రం 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 98 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసి బీలో యావరేజ్ గా నిలిచింది.
భోళాశంకర్..
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'భోళాశంకర్'.. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. 40 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అయితే సినిమా ప్రాఫిట్ లెక్కలు ప్రకారం మాత్రం.. నష్టమే కలిగింది.
బెదురులంక 2012..
ఆర్‌ఎక్స్100 తరువాత సరైన హిట్ లేని కార్తికేయకు ‘బెదురులంక 2012’ సినిమాతో హిట్టు బొమ్మని అందించిన దర్శకుడు 'క్లాక్స్'. దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 16 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది.
రంగబలి, గాండీవధరి అర్జున..
నాగశౌర్య 'రంగబలి', వరుణ్ తేజ్ 'గాండీవధరి అర్జున'.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి.
ఖుషి..
విజయ్ దేవరకొండ, సమంత కంబినేషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'ఖుషి' సూపర్ హిట్టుని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి హీరోహీరోయిన్లుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం మంచి విజయానే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 56 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నవీన్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.
స్కంద..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'స్కంద'.. ఊర మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి కలెక్షన్సే అందుకుంది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం 49 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఏవరేజ్ బొమ్మగా నిలిచింది.
పెద్దకపు, మామ మశ్చీంద్ర..
శ్రీకాంత్ అడ్డాల 'పెద్దకపు', సుధీర్ బాబు 'మామ మశ్చీంద్ర'.. గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మ్యాడ్..
టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్ కథతో వచ్చిన సినిమా 'మ్యాడ్'. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 5 కోట్లతో తెరకెక్కి 24 కోట్లకు పైగా వసూళ్లు చేసి సూపర్ హిట్టుగా నిలిచింది.
భగవంత్ కేసరి..
బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సూపర్ హిట్ అందుకొని బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి తరువాత ఈ చిత్రం కూడా వరుసగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 110 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
టైగర్ నాగేశ్వరరావు..
స్టూవర్ట్‌పురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' లైఫ్ స్టోరీ ఆధారంగా రవితేజ హీరోగా తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద.. 44 కోట్లు పైనే గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి యావరేజ్ గా నిలిచింది.
మా ఊరి పొలిమేర 2, కీడా కోలా..
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర 2' సూపర్ హిట్ గా నిలిస్తే.. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా ఓకే అనిపించుకుంది.
మంగళవారం, ఆదికేశవ..
పాయల్ రాజ్‌పుత్ నటించిన 'మంగళవారం' సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే.. వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' ప్లాప్టాక్ ని తెచ్చుకుంది.
హాయ్ నాన్న..
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హాయ్ నాన్న' ఆడియన్స్ మనసు దోచుకొని మంచి విజయానే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 75 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి సూపర్ హిట్టుని అందుకుంది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, డెవిల్..
నితిన్ నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్లాప్ గా నిలిస్తే.. కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా హిట్టు టాక్ ని సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
సలార్..
బాహుబలి తరువాత సరైన హిట్టు లేని ప్రభాస్ కి 'సలార్'తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ దొరికింది. ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం పాన్ ఇండియా టాప్ గ్రాసర్ గా కూడా నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆదిపురుష్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యింది కదా. అది ఈ లిస్టులో లేదేంటి అంటారేమో. అది పూర్తి బాలీవుడ్ సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Tags:    

Similar News