Rohan Roy : ఇండస్ట్రీలో కొత్త బుడ్డోడు ఇరగదీస్తున్నాడుగా..

#90s వెబ్ సిరీస్ ఫేమ్ రోహన్ రాయ్ ఇండస్ట్రీలో ఇరగదీస్తున్నాడుగా..;

Update: 2024-01-21 05:23 GMT
Rohan Roy : టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త జనరేషన్ టాలెంట్ సత్తా చాటుతున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్స్ వరకు యంగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు చిన్న వయసులోనే తమ నటనతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తమ యాక్టింగ్ తో సినిమా సక్సెస్ లో వారు భాగం అవుతున్నారు. అలా ఇటీవల వచ్చిన #90s వెబ్ సిరీస్ విజయంలో భాగమైన బుడ్డోడు 'రోహన్ రాయ్'.
Full View
మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ 90s బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సిరీస్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా రోహన్ పోషించిన పాత్ర చాలామంది 90s కిడ్స్ కి కనెక్ట్ అయ్యింది. సాంప్రదాయాన్ని దుప్పిని సుద్దపూసని అంటూ సాగే ఆ పాత్ర ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. సరిగ్గా చదువు రాక ఇంటిలో, స్కూల్ లో ఇబ్బందులు పడుతూనే అందరి నవ్వించి.. 90s కిడ్స్ లోని చాలామందికి తమ పాత రోజులను గుర్తు చేశాడు. ఈ సిరీస్ తో రోహన్ పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. ఇక ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో కూడా చాలా సరదాగా మాట్లాడి అందర్నీ నవ్వించాడు.
Full ViewFull View
దీంతో పలు యూట్యూబ్ ఛానల్స్ రోహన్ తో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోహన్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని ప్రశ్నించగా.. నవీన్ పోలిశెట్టి అని బదులిచ్చాడు. అంతేకాదు, నవీన్ పోలిశెట్టి చెప్పిన ఓ మూడు నిమిషాల డైలాగ్ ని గుక్కతిప్పుకోకుండా చెప్పి అదరగొట్టాడు. ఇక రోహన్ టాలెంట్ చూసిన టాలీవుడ్ మేకర్స్ కూడా తనకి అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.
Tags:    

Similar News