రీమేక్ సినిమాలు చేసేటప్పుడు అన్ని కరెక్ట్ గా ఉంటేనే చేయాలి లేకపోతే చేయకూడదు. ఇతర భాషల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా రీమేక్ చేయాలంటే సదరు హీరో తన బాడీ లాంగ్వేజ్ కి ఇమేజ్ కి అది సెట్ అయితేనే చేయాలి లేకపోతే చేయకూడదు. పక్క భాషల్లో కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న చిత్రాలు ఇక్కడ డిజాస్టర్ అయ్యే అవకాశం ఉన్నాయి. గతంలో ఇటువంటి ఉదహారణలు చాలానే చూసాం.
రీమేక్ చేయాలనుకున్నా...
ఈ నేపధ్యంలో తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన '96' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. హీరోగా నాని ఇందులో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నాని 'జెర్సీ' సినిమా తరువాత విక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. నాని ఈ సినిమా చేయడని అర్ధం అయిపోయింది. అల్లు అర్జున్ ఈ సినిమా లేటెస్ట్ గా చూసి ఎట్టి పరిస్థితిలో రీమేక్ చేయాలనుకున్నాడు. కాకపోతే ఆ రైట్స్ దిల్ రాజు దగ్గర ఉండంతో కొద్దిగా వెనక్కి తగ్గాడు. దానికి తోడు ఈ సినిమా తనకు సెట్ అవ్వదని భావించి లైట్ తీసుకున్నాడట.
గోపీచంద్ తో చేయడానికి...
అయితే దిల్ రాజు వేరే హీరోను సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. ఈ క్రమంలో దిల్ రాజు ఒక హీరో దొరికినట్టు తెలుస్తుంది. '96' రీమేక్ లో గోపిచంద్ తో చేయించే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఫైనల్ కాకపోయినా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మాత్రం తెలుగు వర్క్ మొదలు పెట్టినట్టు వినికిడి. మరి ఈ పాత్రకు గోపి చంద్ సెట్ అవ్వుతాడో లేదో పెద్ద ప్రశ్న.