ప్రతాప్ పోతన్ ఎలా మరణించాడు?
సినీనటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో ప్రతాప్ పోతన్ మరణించారు
సినీనటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో ప్రతాప్ పోతన్ మరణించారు. అయితే ఆయన ఎలా మరణించారన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూశారు. ప్రతాప్ పోతన్ మృతి కేవలం కోలివుడ్ లోనే కాక టాలివుడ్ లోనూ విషాదం నింపింది. ప్రతాప్ పోతన్ సినీనటి రాధిక మొదటి భర్త. ప్రతాప్ పోతన్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎన్నో హిట్ సినిమాలు...
ప్రతాప్ పోతన్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన సుపరిచితుడే. 1980, 1990 దశకాల్లో ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యేవి. ఆకలిరాజ్యం, మరో చరిత్ర సినిమాల్లో ఆయన నటించాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రతాప్ పోతన్ 100 కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చిట్టచివరిగా నటించిన చిత్రం సిబీఐ. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. తమిళ సినీనటులు ఆయన ఇంటికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు.