ప్రముఖ నటి హేమకు తీవ్ర అస్వస్థత

ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు.;

Update: 2023-12-20 06:12 GMT
Actress Hema Chaudhary hospitalized, condition critical, movie news,  Hema Chaudhary

Actress Hema Chaudhary

  • whatsapp icon

ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్‌ హెమరేజ్‌కు గుర‌య్యార‌ని నివేదిక‌లు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యం పాలైన‌ ఆమెను వెంట‌నే ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హేమ కొడుకు ఐర్లాండ్‌లో ఉన్నాడు. అత‌డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. చికిత్సకు ఆమె శరీరం స్పందించడం లేదని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఈ విష‌య‌మై వైద్య బృందం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సివుంది. హేమ అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటి లీలావతి జయంతిని 18వ తేదీన నేలమంగళలోని సోలదేవనహళ్లిలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి హేమా చౌదరి హాజర‌య్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నటి హేమా కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో 180కి పైగా చిత్రాల్లో నటించారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, అనంత్ నాగ్, శంకర్ నాగ్, రవిచంద్రన్ వంటి చాలా మంది అగ్ర‌ నటులతో హేమా చౌదరి స్క్రీన్ షేర్ చేసుకుంది. 2011లో కన్నడ టెలివిజన్‌లో పాపులర్ సీరియల్ 'అమృతవర్షిణి'లో ప్రధాన పాత్ర పోషించి ప్రజల హృదయాలను గెలుచుకుంది.


Full View


Tags:    

Similar News