పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా .. మరి తండ్రెవరు ?

తాజాగా అభిమానులు, నెటిజన్లకు షాకిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను..

Update: 2023-04-18 09:26 GMT

ileana pregnancy news

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవదాసుతో మొదలైన ఆమె టాలీవుడ్ ప్రయాణం పోకిరి, కిక్, జులాయి వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ గానే నడిచింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడం, ఇలియానా కూడా జీరో సైజ్ నుంచి కాస్త చబ్బీగా తయారవడంతో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోందీ గోవా భామ. తాజాగా అభిమానులు, నెటిజన్లకు షాకిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను షేర్ చేసింది. ఒక ఫొటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఉన్న టీషర్ట్ ఉండగా.. మరో ఫొటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్ ను చూపించింది. ఆ పెండెంట్ పై మామా (అమ్మ) అనే ఇంగ్లిష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. మై లిటిల్ డార్లింగ్.. నిన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు.

తల్లి కాబోతున్నందుకు ఇలియానాకు కంగ్రాట్స్ చెబుతూనే.. తండ్రెవరో చెప్పాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ పోస్ట్ కు ఇలియానా తల్లి కూడా సపోర్ట్ గా కామెంట్ పెట్టడం విశేషం. మనవడు/ మనవరాలికి స్వాగతం చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. 2019లో వాళ్లు విడిపోయారని ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో ఇలియానా ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇలియానా మాత్రం వాటిపై స్పందించలేదు.


Tags:    

Similar News