సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఇప్పుడు OTT లోకి....

బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కోర్ట్ సినిమా ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.;

Update: 2025-04-07 04:14 GMT
Blockbuster Telugu film ‘Court’ to stream on Netflix from April 11

Blockbuster Telugu film ‘Court’ to stream on Netflix from April 11 

  • whatsapp icon

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిన్న చిత్రం ‘కోర్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌పై విడుదలకు సిద్ధమైంది. మార్చి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విశేష ప్రేక్షకాదరణతో పాటు, బాక్సాఫీస్ వద్ద రూ.57 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి హిట్ ట్రాక్ లోకి చేరింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో, హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు.

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై తాజాగా స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్, ఏప్రిల్ 11న నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హీరో నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పటి వరకు తెలుగు భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. లవ్ స్టోరీ మరియు పోక్సో కేసు చుట్టూ తిరిగే కథా బంధం, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం, అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా సంయుక్తంగా నిర్మించారు.

Tags:    

Similar News