కవలలకు జన్మనిచ్చిన నటి నమిత

తమకు అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమతో ఉంటాయని, ఇకపై కూడా అవి కొనసాగుతాయని..;

Update: 2022-08-20 06:54 GMT

సొంతం, జెమిని, సింహా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన సినీ నటి నమిత కవలలకు జన్మనిచ్చింది. ఇన్ స్టా గ్రామ్ పోస్టు ద్వారా నమిత ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. చెన్నైకు సమీపంలోనున్న క్రోమ్ పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పండంటి ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. భర్తతో కలిసి ఇద్దరు పిల్లలను ఎత్తుకున్న నమిత.. వీడియోలో మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తాను ఇద్దరు కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమతో ఉంటాయని, ఇకపై కూడా అవి కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం పిల్లలు, తాను ఆరోగ్యంగానే ఉన్నామని కాగా.. 2017 నవంబరులో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నమిత వివాహమాడారు. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.


Tags:    

Similar News