పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ.. వరుడు ఎవరంటే

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

Update: 2022-06-01 11:03 GMT

షామ్నా ఖాసిమ్ అంటే మన తెలుగు వాళ్లకు తెలియకపోవచ్చు కానీ.. పూర్ణ అంటే చాలు అందరికీ తెలుసు. ఆ ఇంట్లో, సీమ టపాకాయ్.. లాంటి సినిమాలతో మొదలుకొని అఖండ సినిమాలో కూడా పూర్ణ నటించింది. బుల్లితెర మీద కూడా జడ్జిగా అలరిస్తూ ఉంది. ఇక ఇన్ని రోజులూ అమ్మడి పెళ్లి ఎప్పుడు, వరుడు ఎవరు అనే ప్రశ్నలు ఆమెను వెంటాడాయి. తాజాగా తన లైఫ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందని పూర్ణ చెప్పేసింది. "జీవితంలో నా తదుపరి భాగానికి అడుగుపెడుతున్నాను." అని షానిద్ అసిఫాలీని వివాహం చేసుకున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. యుఏఈలో వ్యాపారవేత్త అయిన తన కాబోయే భర్త షానిద్ అసిఫాలీతో కొన్ని చిత్రాలను షేర్ చేసింది.

32 రెండేళ్ల పూర్ణ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోంది. తన భాగస్వామిని ప్రపంచానికి పరిచయం చేసింది. కుటుంబ సభ్యుల దీవెనలతో జీవితంలో తదుపరి అంకంలోకి ప్రవేశించాను. షానిద్ అసిఫాలీ తో ఎంగేజ్మెంట్ జరిగింది, అని పూర్ణ కామెంట్ పెట్టారు. రింగ్ ఎమోజీ పోస్ట్ చేయడంతో వారికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. షానిద్ అసిఫాలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలుస్తోంది.
2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు సీమ టపాకాయ్ మూవీ గుర్తింపు తెచ్చింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల బ్యాక్‌డోర్‌, అఖండ వంటి చిత్రాలలో ఆమె నటించింది.


Tags:    

Similar News