ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి

ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి 'వరలక్ష్మి శరత్‌కుమార్' పెళ్లి పీటలు;

Update: 2024-03-02 14:04 GMT
ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి
  • whatsapp icon

ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి 'వరలక్ష్మి శరత్‌కుమార్' పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఎంతో ప్రైవేట్ గా వరలక్ష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆర్ట్ గ్యాలరీ యజమాని 'నికోలాయ్ సచ్‌దేవ్‌'ను ఆమె వివాహం చేసుకోనుంది. పద్నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉందని తెలుస్తోంది. సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ మార్చి 1న జరిగింది. ముంబైలోని ఒక హోటల్‌లో సమీప కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కు హాజరయ్యారు.

వరలక్ష్మి 2012లో "పోడా పోడి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదట హీరోయిన్ గా వరలక్ష్మి అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం దుమ్ము దులుపుతోంది. వీర సింహా రెడ్డి, హనుమాన్ సినిమాల్లో వరలక్ష్మి మంచి క్యారెక్టర్లు చేసింది. ధనుష్ కొత్త సినిమా "రాయాన్"లో కూడా ఆమె కనిపిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి వరలక్ష్మి వివాహం జరగబోతోంది.


Tags:    

Similar News