వీక్ డేస్ లో వీకైన ఎవరు

అడవి శేష్ హీరో రెజినా హీరోయిన్ గా నటించిన ఎవరు సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లో భారీగా [more]

;

Update: 2019-08-23 08:45 GMT
ఎవరు
  • whatsapp icon

అడవి శేష్ హీరో రెజినా హీరోయిన్ గా నటించిన ఎవరు సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లో భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఎవరు సినిమా వీక్ డేస్ లో వీకైపోయింది. కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని ఆకర్షించిన ఎవరు సినిమాకి హిట్ టాక్ పడినా… బిసి సెంటర్స్ ఆడియన్స్ వలన ఎవరు సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కని ఎవరు సినిమా ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా రాగలిగింది. వీకెండ్ లో ఉన్న జోరు వీక్ డేస్ లోను కనబడితే ఎవరు బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరేది. కానీ.. ఇప్పడు ఎవరు జస్ట్ హిట్ సినిమాగానే మిగిలిపోయింది. ఇక నేడు శుక్రవారం విడుదలకాబోతున్న చిన్న చితక సినిమాల్లో ఒక్క సినిమాకి హిట్ టాక్ పడినా ఎవరు దుకాణం సర్దేయ్యాల్సిందే.

ఏరియా: 8 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 2.96
సీడెడ్ 0.74
అర్బన్ ఏరియాస్ 0.94
గుంటూరు 0.45
ఈస్ట్ గోదావరి 0.47
కృష్ణ 0.54
వెస్ట్ గోదావరి 0.29
నెల్లూరు 0.15

ఏపీ అండ్ టీఎస్ షేర్ 6.54
ఇతర ప్రాంతాలు 0.60
ఓవర్సీస్ 1.40

వరల్డ్ వైడ్ షేర్ 8.54

Tags:    

Similar News