నాని విలన్ అదితి నా?

నాని వి.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలకు సిద్ధమవుతుంటే.. నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, టాక్సీవాలా దర్శకుడు తో శ్యాం సింగ రాయ్ [more]

Update: 2020-08-18 04:05 GMT

నాని వి.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలకు సిద్ధమవుతుంటే.. నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, టాక్సీవాలా దర్శకుడు తో శ్యాం సింగ రాయ్ సినిమాలకు కమిట్ అయ్యాడు. టక్ జగదీశ్ పై వస్తున్న గాసిప్స్ కి తాజాగా సోషల్ మీడియా ద్వారా నాని చేక్ పెట్టాడు. అయితే తాజాగా నాని శ్యాం సింగ్ రాయ్ సినిమా కథపై, అందులోని విలనీ పాత్రపై, హీరోయిన్ పాత్రపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వి హీరోయిన్ అదితిని సంప్రదించాడట దర్శకుడూ రాహుల్. అయితే అదితిని సంప్రదించింది హీరోయిన్ పాత్రకి కాదని పవర్ ఫుల్ లేడి విలన్ పాత్రకని తెలుస్తుంది.

శ్యాం సింగ రాయ్ లో ఓ అదిరిపోయే పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర నెగెటివ్ క్యారెక్టరైజేషన్ లో వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఆపాత్రకి అదితి అయితే న్యాయం చేస్తుందని.. రాహుల్ ఆమెని సంప్రదించాడట. మరి అదితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. నాని ఈ సినిమాలో మరోమారు సాయి పల్లవితో రొమాన్స్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నాని తో నటించిన సాయి పల్లవి మరోసారి నాని తో శ్యాం సింగ రాయ్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట.

Tags:    

Similar News