నాగ్ ఎడిట్ చేయడం వల్ల ఆ కామెడీ సీన్స్ పోయాయి

మంచి అంచనాలు మధ్య నిన్న రిలీజ్ అయినా నాగార్జున మన్మధుడు 2 కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచింది. [more]

;

Update: 2019-08-10 06:53 GMT

మంచి అంచనాలు మధ్య నిన్న రిలీజ్ అయినా నాగార్జున మన్మధుడు 2 కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచింది. అలానే రావు రమేష్ పాత్ర కూడా అక్కడక్కడా మెప్పించింది. నిజానికి రావు రమేష్ పాత్రకు సంబంధించి చాలానే సీన్స్ ఉన్నాయట. కానీ అవి ఎడిటింగ్ లో ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అవి చాలావరకు ఫన్ సీన్స్ అంట.

రావు రమేష్ పాత్రకి స్టార్టింగ్ లో ఇచ్చిన బిల్డప్ తరువాత ఇవ్వలేదు అని ఆ పాత్ర చూస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలి మొత్తం ఆదివారం డైనింగ్ టేబుల్ దగ్గర చాలా సీన్స్ వున్నాయని తెలుస్తోంది. అవి ఎడిటింగ్ లో పోయినట్టు తెలుస్తుంది. ఈ సీన్స్ అన్ని నాగార్జుననే ఎడిట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సినిమా లెంగ్త్ గా అనిపిస్తే వెంటనే ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుని ఎడిటింగ్ చేసేస్తున్నాడు.

అలానే ఈసినిమా విషయంలో జరిగింది. అందుకే రావు రమేష్ కి సంబంధించి సీన్స్ దాదాపు పోయాయి అని తెలుస్తుంది.

Tags:    

Similar News