సామ్ అమెరికా లో దున్నేస్తుంది

అక్కినేని సమంత లేటెస్ట్ హిట్ మూవీ ఓ బేబీ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కొన్ని రోజులు నుండి టాలీవుడ్ బాక్స్ [more]

Update: 2019-07-07 15:57 GMT

అక్కినేని సమంత లేటెస్ట్ హిట్ మూవీ ఓ బేబీ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కొన్ని రోజులు నుండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా డల్ గా ఉండడంతో ఈ సినిమాతో ఒక్కసారిగా వేడి అందుకుంది. అమెరికాలో సైతం ఈమూవీ ప్రకంపనలు రేపుతోంది.

రివ్యూస్, టాక్ బాగా రావడంతో అనూహ్యంగా ఈ చిత్రానికి ప్రిమియర్లతోనే 1.45 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఇంతలా రావడం అంటే మాములు విషయం కాదు. అలానే తొలి రోజు అంటే శుక్రవారం కూడా ఈమూవీ ఊపును కొనసాగిస్తూ 1.53 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఆలా మొత్తంగా ఈమూవీ తొలి రోజుకే ఈ చిత్రం 3 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా వచ్చింది.

శనివారం కూడా వసూళ్లు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వారు. ఈజీగా 2 లక్షల డాలర్లు ఖాతాలో పడొచ్చు అంటున్నారు. అలా వీకెండ్ లోపే ఈచిత్రం హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేస్తోందన్నమాట. ఒకవేళ అదే జరిగితే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇదొక చరిత్రే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా తక్కువ ఏమి కలెక్ట్ చేయడంలేదు.

Tags:    

Similar News