అవార్డు వచ్చాక.. అల్లు అర్జున్ చెప్పింది ఇదే..!

భారతీయ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను

Update: 2023-08-24 16:55 GMT

భారతీయ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో అత్యుతమ నటనకు గానూ 'జాతీయ ఉత్తమ నటుడు' అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చాక అభిమానులు, మీడియా బన్నీ ఇంటికి పోటెత్తారు. ఈ సమయంలో బన్నీ చెప్పింది ఒకే ఒక్క మాట..! 'షాక్‌లో ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను' అంతే..! దాదాపు ఏడు దశాబ్దాలుగా తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. అల్లు అర్జున్ ద్వారా టాలీవుడ్‌కు ఈ గౌరవం దక్కింది.

దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

Tags:    

Similar News