అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 'ఇండియా టుడే' కవర్ పేజీపై అల్లు అర్జున్ కనిపించడం విశేషం.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 'ఇండియా టుడే' కవర్ పేజీపై అల్లు అర్జున్ కనిపించడం విశేషం. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం విశేషం. 'ది సౌత్ స్వాగ్' పేరుతో ఇండియా టుడే కవర్ పేజీపై కనిపించాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఈ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. గత ఏడాది పుష్ప: ది రైజ్ విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ కు నార్త్ సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. నార్త్ బెల్ట్‌లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా, ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే తన కవర్ పేజీలో అల్లు అర్జున్‌ను 'సౌత్ స్వాగ్' అని ప్రచురించింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ సహా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమాలోని పాటలు భారీగా పాపులర్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని మ్యాజిక్ ఆల్బమ్ కొత్త రికార్డు సాధించింది. దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి పాటలు హైలైట్ గా ఉండడంతో ఉర్రూతలూగించాయి. ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదని తెలిపారు.