బన్నీ సినిమా స్టోరీ ఇదేనట..!

చాలా గ్యాప్ తరువాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ కి [more]

Update: 2019-05-31 10:03 GMT

చాలా గ్యాప్ తరువాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు బన్నీ, త్రివిక్రమ్. సెకండ్ షెడ్యూల్ జూన్ 4 నుండి జరగనుంది. ఇక సహజంగానే తన సినిమాల్లో ఎమోషన్ ను కాస్త ఎక్కువుగానే ఉండేలా చూసుకుంటాడు త్రివిక్రమ్. ఈసారి కూడా ఎమోషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వనున్నాడు. ఎమోషన్ ని మరింత పెంచుతూ… సిస్టర్ సెంటిమెంట్ కి సంబంధించి సీక్వెన్స్ రాసాడట త్రివిక్రమ్.

చెల్లి చుట్టూ తిరగనున్న కథ…

సిస్టర్ సెంటిమెంట్ అంటే నాలుగైదు డైలాగ్స్, రెండు ఎమోషనల్ సీన్స్ కాకుండా ఇన్సిడెంట్స్ రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా త్రివిక్రమ్ కథ రాశాడని తెలుస్తోంది. ఇక ఇందులో మరోసారి బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ముఖ్య పాత్రల్లో సుశాంత్, నవదీప్ కూడా నటిస్తున్నారు. అల్లు అర్జున్ తల్లిగా టబు నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రానుంది. సంక్రాంతి రేస్ లో ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News