బన్నీ కూడా ముంబై కి మకాం మార్చేస్తున్నాడా?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ కి ఎగ బడుతున్నారు. ప్రభాస్ బాహుబబలితో ఎంట్రీ ఇచ్చి సాహో తో దెబ్బతిన్నాడు. మరోపక్క చిరు సైరా బాగా [more]

;

Update: 2020-05-12 03:59 GMT

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ కి ఎగ బడుతున్నారు. ప్రభాస్ బాహుబబలితో ఎంట్రీ ఇచ్చి సాహో తో దెబ్బతిన్నాడు. మరోపక్క చిరు సైరా బాగా దెబ్బేసింది. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు RRR తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప అంటూ పాన్ ఇండియా ఫిలిం మొదలెట్టాడు. మరోపక్క విజయ్ దేవరకొండ ఇప్పటికే పాన్ ఇండియా మూవీ షూటింగ్ కూడా సగం పూర్తి చేసాడు. అయితే విజయ్ కోసం పూరి జగన్నాధ్ ముంబై లో ఓ ఆఫీస్ ఓపెన్ చేసాడు కూడా.

అయితే అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నప్పటికీ ముంబై లో ఉండేలా ఓ ఇల్లు కొనేందుకు మాత్రం ప్లాన్ చెయ్యలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతూ ముంబై మకాం గురించి ఆలోచించేస్తున్నాడు. ముంబై అంటే ఇష్టమని చెబుతున్న అల్లు అర్జున్ ముంబై లో ఓ ఇల్లు కొనే ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటికే అన్ని హంగులతో హైదరాబాద్ లో అల్లు అర్జున్ ముచ్చటపడి కట్టించుకున్న ఇంట్లోకి త్వరలోనే మారబోతున్నాడు. అలాగే ఇక్కడ కార్పొరేట్ లెవల్లో ఓ ఆఫీస్ కూడా తెరవబోతున్నాడు. మరో పక్క ముంబై పాన్ ఇండియా ఫిలిమ్స్ కి అనుకూలమని అల్లు అర్జున్ అక్కడ ఇల్లే కొనేస్తున్నాడట.. ముంబై ప్లాన్స్ వెనక కూడా ప్లానింగ్ చాలానే ఉంది. ఎప్పటినుండో బన్నీ ముంబై ప్లాన్స్ ఉన్నాయని సరైన కథ దొరక్క వెళ్లలేదని కానీ పుష్ప తో ఇప్పుడు అది సాధ్యమైంది అని అంటున్నారు.

Tags:    

Similar News