అల్లు అర్జున్ – సుక్కు రెండక్షరాల టైటిల్ అదేనా?

అల్లు అర్జున్ – సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కి సంబందించిన స్పెషల్ ప్రకటన రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు న రివీల్ చెయ్యడానికి [more]

;

Update: 2020-04-07 09:33 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కి సంబందించిన స్పెషల్ ప్రకటన రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు న రివీల్ చెయ్యడానికి ఓ పోస్టర్ ని కూడా వదిలారు. అల్లు అర్జున్ పుట్టినరోజుకి సుకుమార్ ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ కానీ ఈ సినిమా కి సంబందించిన మోషన్ పోస్టర్ వదలడం కష్టం కనక అల్లు అర్జున్ లుక్ తో పాటుగా ఆ సినిమా టైటిల్ ని వదలబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని అంటున్నారు.

అయితే బన్నీ – సుక్కు సినిమా కి రెండక్షరాల టైటిల్ అంటూ… ఇది సుక్కు – బన్నీ సెంటిమెంట్ అంటూ ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ గా పుష్ప అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ పేరు పుష్ప కాబట్టి.. అందుకే ఈ సినిమాకి పుష్ప టైటిల్ పెట్టారని అంటుంటే… మరోవైపు.. ఈ సినీమాలో హీరో పేరే… పుష్ఫక్ నారాయణ్ గా ఈ సినిమాలో బన్నీ కనిపించబోతున్నాడు. సినిమాలో అల్లు అర్జున్ ని అంతా పుష్ష అని పిలుస్తుంటారు. అందుకే ఈసినిమాకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేసి.. రేపు పుట్టిన రోజు కానుకగా ఈ టైటిల్ తో పాటుగాసినిమా ఫస్ట్ లుక్ కూడా వదలబోతున్నారట.

Similar News