ఫస్ట్ లుక్ కి డేట్ కుదిరింది..!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని మెగా ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ప్రకటించిన ఈ కాంబో ఇప్పటివరకు పట్టాలెక్కకపోయేసరికి వీరి [more]

Update: 2019-04-05 08:45 GMT

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని మెగా ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ప్రకటించిన ఈ కాంబో ఇప్పటివరకు పట్టాలెక్కకపోయేసరికి వీరి కాంబో మీద రోజుకో న్యూస్ సోషల్ మీడియాకెక్కింది. మరి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబో అధికారికంగా రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశాలున్నాయని తాజా సమాచారం. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై కుస్తీలు పడుతున్నాడని.. అలాగే ఈ సినిమాలో స్పెషల్ లుక్ కోసం అల్లు అర్జున్ కి ఫోటో షూట్ కూడా చేసారని అంటున్నారు.

బర్త్ డే రోజు ఫస్ట్ లుక్

ఆ ఫోటో షూట్ నుండి అల్లు అర్జున్ ఒక లుక్ ని లాక్ చేసారని.. అల్లు అర్జున్ బర్త్ డే రోజున అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఫస్ట్ లుక్ బయటికొస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇక పూజా కార్యక్రమాలతో త్వరలోనే సినిమాని మొదలు పెట్టి.. రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం ఈనెల 24 నుండి మొదలు పెట్టనున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాని రెండు మూడు నెలల్లో అల్లు అర్జున్ పూర్తి చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే ఫస్ట్ హీరోయిన్ గా, కేథరిన్ సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసారనే టాక్ ఉంది.

Tags:    

Similar News