అనసూయ – రష్మీ మిస్సింగ్?

ఈటీవీలో పండగ స్పెషల్ ప్రోగ్రామ్.. పండగ సర్.. పండగ అంతే అంటూ ఉగాది స్పెషల్ ప్రోగ్రాం ఈటీవీలో ఉగాది రోజున ప్రసారం కాబోతుంది. అయితే దీనికి పోటీగా [more]

Update: 2020-03-17 06:19 GMT

ఈటీవీలో పండగ స్పెషల్ ప్రోగ్రామ్.. పండగ సర్.. పండగ అంతే అంటూ ఉగాది స్పెషల్ ప్రోగ్రాం ఈటీవీలో ఉగాది రోజున ప్రసారం కాబోతుంది. అయితే దీనికి పోటీగా జీ ఛానల్ లో బాబుగారింట్లో బుట్ట భోజనం అంటూ నాగబాబు ఆధ్వర్యంలో ఉగాది స్పెషల్ ప్రోగ్రాం జీ ఛానల్ లో రాబోతుంది. అయితే ఎప్పుడూ ఈటివి స్పెషల్ ప్రోగ్రాంలో అనసూయ లేదా రష్మీ యాంకరింగ్ తో హోరెత్తించేవారు. కానీ ఈసారి ఉగాది పండగ స్పెషల్ ఈ టివి ప్రోగ్రాంలో జబర్దస్త్ హాట్ యాంకర్స్ అనసూయ కానీ, రష్మీ కానీ కనబడలేదు. అనసూయ అయితే బాబుగారింట్లో బుట్టభోజనంలో అందమైన నృత్యంతో అదరగొట్టేస్తుంది. కానీ పండగ సర్ పండగ అంతే లో లేదు. ఇక ఈ షోలో శేకర్ మాస్టర్ డాన్స్ తో దుమ్ముదులిపితే.. అక్కడ బాబుగారింట్లో దానిలో జానీ మాస్టర్ డాన్స్ తో అదరగొట్టాడు.

ఇక ఈటివి ప్రోగ్రాంలో అనసూయ, రష్మీ మిస్ అయితే యాంకర్ లాస్య మళ్ళీ ఈ పండగ సర్ పండగ అంతే తో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితో గొడవ తర్వాత పెళ్లి తో బుల్లితెరకు దూరమైన లాస్య మళ్ళీ చాన్నాళ్ళకి ఈటివి స్పెషల్ ప్రోగ్రాం తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. మరి జీ ఛానల్ ప్రోగ్రాం చూసాక ఈటివి వారు తమ ప్రోగ్రాం ని హైలెట్ చేయడానికి రోజుకో ప్రోమోని యూట్యూబ్ లో వదులుతుంది. తాజాగా వదిలిన పండగ సర్ పండగ అంతే ప్రోమోలో ఆది పంచ్ డైలాగ్స్, సుధీర్ తడిపొడి… స్వాతిలో మత్యమంత సాంగ్‌లో మరొక లేడి డాన్సర్ తో కలిసి అదరగొట్టేయ్యగా… జబర్డస్ట్ స్కిట్స్ అన్ని హైలెట్ అయ్యేలా కనబడుతున్నాయి. మరి ఉగాది టీఆర్పీస్ లో జీ ఛానల్, ఈ టివి నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నాయి. చూద్దాం ఎవరిదీ పైచెయ్యి అవుతుందో అనేది.

Tags:    

Similar News