అనసూయ రేంజ్ మారిపోయింది!
అనసూయ ఇప్పుడు బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద ఫుల్ బిజీ. వెండితెర మీద చేతినిండా సినిమాలతో తెగ హడావిడి చేస్తుంది. ఇద్దరి పిల్లల తల్లిలా కాకుండా [more]
;
అనసూయ ఇప్పుడు బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద ఫుల్ బిజీ. వెండితెర మీద చేతినిండా సినిమాలతో తెగ హడావిడి చేస్తుంది. ఇద్దరి పిల్లల తల్లిలా కాకుండా [more]
అనసూయ ఇప్పుడు బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద ఫుల్ బిజీ. వెండితెర మీద చేతినిండా సినిమాలతో తెగ హడావిడి చేస్తుంది. ఇద్దరి పిల్లల తల్లిలా కాకుండా ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ లా ఉంది అనసూయ పరిస్థితి. రంగస్థలంలో దర్శకుడు సుకుమార్ ఇచ్చిన రంగమ్మత్త పాత్రతో వెండితెరకు పూల పాన్పు వేసుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరేకుతున్న పుష్ప సినిమాకి నో చెప్పిందనే టాక్ మొదలయ్యింది. అయితే ఈ సినిమాలో అనసూయ బందిపోటు రాణిగా కనిపిస్తుంది అనే ప్రచారం పుష్ప సినిమా అనుకున్నప్పటినుండి జరుగుతుంది.
కానీ పుష్ప సినిమాలో హీరో దగ్గరనుండి హీరోయిన్ వరకు అందరూ డీ గ్లామరస్ గా కనిపించబోతున్నారు. అనసూయ కూడా తన పాత్రకి డీ గ్లామర్ గా కన్పించాల్సి రావడంతో అనసూయ పుష్ప పాత్రకి నో చెప్పింది అంటుంటే.. కాదు అనసూయ తెలుగు, తమిళ సినిమాలతో బాగా బిజీ. అందుకే డేట్స్ క్లాష్ వలనే సుకుమార్ పుష్పకి నో చెప్పింది.. మేకప్ వేసుకోకూడదని కాదు అని అంటున్నారు. రంగమ్మతత్తో తనని నిలబెట్టిన సుకుమార్ తో పని చెయ్యలేకపోతున్నందుకు అనసూయ కూడా బాగా ఫీలవుతుందట. కానీ తాను కీలక పాత్రలో నటిస్తున్న సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకే సుకుమార్ పుష్ప సినిమాకి అనసూయ నో చెప్పిందట.