శ్రీముఖికే ఝలకిచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది మొదలు అందులోని స్ట్రాంగ్ కంటెస్టెంట్, క్రేజీ సెలెబ్రిటీ అయినా శ్రీముఖిని బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుతూ.. ఎలిమినేషన్ నుండి తప్పించడమే [more]

Update: 2019-11-11 05:08 GMT

బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది మొదలు అందులోని స్ట్రాంగ్ కంటెస్టెంట్, క్రేజీ సెలెబ్రిటీ అయినా శ్రీముఖిని బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుతూ.. ఎలిమినేషన్ నుండి తప్పించడమే కాదు… శ్రీముఖి కి టైటిల్ విన్నర్ గా చెయ్యాలని బిగ్ బాస్ ఎడిటింగ్ టీం ప్లాన్ చేసి.. శ్రీముఖి నెగెటివ్ షేడ్స్ ని బుల్లితెర మీద ప్రసారం చెయ్యకుండా ఆపేశారని, శ్రీముఖి కి ఫెవర్ గా బిగ్ బాస్ టీం పనిచేస్తుందని, అసలు శ్రీముఖి, బిగ్ బాస్ వారితో కాంట్రాక్టు చేసుకుని రోజుకి లక్ష తో పాటుగా బిగ్ బాస్ విన్నింగ్ టైటిల్ కావాలని అందని ఇలా ఎన్నో న్యూస్ లు సోషల్, వెబ్ మీడియాని చుట్టేశాయి.

మరి శ్రీముఖి బయట ఏదో ఒక షో తో ఎపుడూ బిజీగా వుండే క్రేజీ కంటెస్టెంట్ కాబట్టి ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ లేకుండా సాగింది. మరోపక్క శ్రీముఖి వలన బిగ్ బాస్ యాజమాన్యం ఇరుకున పడింది అని అన్నారు.. ఆమెకి రోజుకి లక్ష ఇచ్చినట్టుగా తర్వాతి సీజన్ లో క్రేజీ కంటెస్టెంట్ కి ఎంత ఇవ్వాల్సి వస్తుందో అని బిగ్ బాస్ యాజమాన్యం తలపట్టుకుందనే న్యూస్ కూడా నడిచింది. తాజాగా శ్రీముఖి వలన బిగ్ బాస్ కి నష్టం లేదని, శ్రీముఖికే బిగ్ బాస్ వలన నష్టం జరిగిందని వాపోతుందట. అసలే టైటిల్ రాక బాధలో ఉన్న శ్రీముఖి కి ఇప్పుడు బిగ్ బాస్ కూడా షాకిచ్చింది. అదేమంటే ముందు అనుకున్న రెమ్యునరేషన్ ప్రకారం శ్రీముఖికి అడిగింది ఇవ్వలేదని, హౌస్ లోకి అడుగుపెట్టాక తనని బిగ్ బాస్ నిర్వాహకులు పట్టించుకోలేదని, తనకి హామీ ఇచ్చిన వాళ్లే తనని నట్టేట ముంచేశారని శ్రీముఖి సన్నిహితుల దగ్గర తెగ బాధపడిపోతుందట. పాపం తాను హెట్ చేసిన రాహుల్ కప్పు, మనీ రెండూ ఎగరేసుకుపోయాడని అసలు బాధ శ్రీముఖిది… పైకి చెప్పదు అంతే

Tags:    

Similar News