పెళ్లిపీటలెక్కనున్న యాంకర్ వర్షిణి.. ఇంతకీ అతనెవరు ?

సోషల్ మీడియాలో రకరకాల ఫోజులతో ఫొటోలు షేర్ చేస్తూ..కొన్ని విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ..;

Update: 2022-10-02 10:14 GMT

బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్న లేడీ యాంకర్లలో వర్షిణి ఒకరు. పెళ్లిగోల వెబ్ సిరీస్ తో అందరికీ పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత యాంకర్ గా గుర్తింపు పొందింది. పలు టీవీ షోలలో యాంకర్ చేసిన వర్షిణి.. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది. కానీ.. అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్ గా రాణించి.. లక్షల ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్న వర్షిణి.. త్వరలోనే పెళ్లపీటలెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి.

సోషల్ మీడియాలో రకరకాల ఫోజులతో ఫొటోలు షేర్ చేస్తూ..కొన్ని విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఎంత గ్లామర్ చూపించినా అవకాశాలు రాకపోవడంతో.. పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. ఆ వ్యక్తి ఎవరో కాదు. వర్షిణికి వరుసకు బావేనట. చిన్నప్పుడే వారిద్దరి పెళ్లిని పెద్దలు ఫిక్స్ చేశారని.. ఈ క్రమంలోనే వర్షిణి తన బావతో కలిసి ఏడు అడుగులు వేయనుందని తెలుస్తోంది. దీనిపై వర్షిణి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News