జగన్ వారిద్దరికీ స్పెషల్ ఇన్విటేషన్.. అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సినీ రంగ ప్రముఖులతో భేటీ అయ్యారు. చిరంజీవికి ఆయన ప్రత్యేక ఆహ్వానం పంపారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సినీ రంగ ప్రముఖులతో భేటీ అయ్యారు. చిరంజీవికి ఆయన ప్రత్యేక ఆహ్వానం పంపారు. మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణమూర్తి వంటి వారు వచ్చారు. అయితే వీరితో పాటు రచయిత పోసాని కృష్ణమురళి, హాస్యనటుడు ఆలీ ఈ సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశమైంది.
వీరిద్దరూ...
పోసాని కృష్ణమురళి సినీ రచయిత. ఆయన తొలి నుంచి వైసీీపీకి అండగా ఉంటున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ అభిమానులకు పోసాని టార్గెట్ అయ్యారు. అప్పటి నుంచి పోసాని నిశ్శబ్దంగా ఉంటున్నారు. అయితే పోసాని కృష్ణమురళి ఈ చర్చల్లో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే హాస్యనటుడు ఆలీ తన సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కాదని 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆయనకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. టాలీవుడ్ లో తనకు మద్దతిస్తున్న వారిని ప్రత్యేకంగా జగన్ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు. చర్చలలో వీరిద్దరి భాగస్వామ్యం పెద్దగా లేకపోయినా వారి హాజరు మాత్రం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.