నిర్మాత ఒప్పుకున్నాడు.. కరోనా అడ్డం పడింది!!

RX 100 దర్శకుడు అజయ్ భూపతి కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఫస్ట్ సినిమా RX 100 అనుకోకుండా హిట్ అవడం.. రెండో సినిమా కథతో తిరిగిన [more]

;

Update: 2020-04-05 06:50 GMT
ajay bhupathi next film
  • whatsapp icon

RX 100 దర్శకుడు అజయ్ భూపతి కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఫస్ట్ సినిమా RX 100 అనుకోకుండా హిట్ అవడం.. రెండో సినిమా కథతో తిరిగిన హీరో దగ్గరికి తిరక్కుండా తిరుగుతున్నా అజయ్ భూపతికి ఎట్టకేలకు హీరో సెట్ అయ్యాడు. మహా సముద్రం అనే మీడియం బడ్జెట్ కథతో రవితేజ దగ్గర్నుండి నాగ చైతన్య వరకు అజయ్ భూపతి తిరిగి తిరిగి చివరికి హీరో శర్వానంద్ దగ్గర మహాసముద్రం కథని ఓకె చేయించుకున్నాడు. శర్వానంద్ మహాసముద్రం కథతో సినిమా చేద్దామని చెప్పాడు.

శర్వానంద్

అయితే అజయ్ భూపతి – శర్వా కాంబో సినిమాని అనిల్ సుంకర నిర్మించడానికి రెడీ అయ్యాడు. అయితే మధ్యలో శర్వానంద్ మీద రిస్క్ చేసి బడ్జెట్ 30 కోట్లు పెట్టడానికి అనిల్ సుంకర వెనక్కి తగ్గాడని..దానితో అజయ్ భూపతి కథ మొదటికి వచ్చింది అని అనుకున్నారు. అజయ్ భూపతి శర్వా కోసం మరో నిర్మాత వేటలో ఉన్నాడనే టాక్ నడిచింది. ఎట్టకేలకి అనిల్ సుంకర మహాసముద్రం స్క్రిప్ట్ మీద బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యాడట. కానీ కరోనా కారణంగా ఈ సినిమా పట్టాలెక్కాల్సిన టైం లో పట్టాలెక్కలేదు. కరోనా లాక్ డౌన్ ఎన్నడూ ముగియాలి.. ఎన్నడూ మహాసముద్రం పట్టాలెక్కాలి.. పాపం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని.. అజయ్ భూపతిని చూస్తే అనాలనిపిస్తుంది.

Tags:    

Similar News