గ్లామర్ షో చేసి దెబ్బతిన్నానంటుంది
వరసగా మెగా హీరోలతో సినిమాలు చేసి.. గ్లామరస్ గా అలరించినా క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ [more]
;
వరసగా మెగా హీరోలతో సినిమాలు చేసి.. గ్లామరస్ గా అలరించినా క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ [more]
వరసగా మెగా హీరోలతో సినిమాలు చేసి.. గ్లామరస్ గా అలరించినా క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ తరుణ్ లాంటి యూత్ హీరోలతో నటించినా అనుకి అస్సలు క్రేజ్ సంపాదించలేకపోయింది. అను ఇమ్మాన్యువల్ కి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. గ్లామర్ షో చేసినా అమ్మడుకి అవకాశాలు కరువయ్యాయి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య భారీ డిజాస్టర్స్ తో అను ఇమ్మాన్యువల్ సోది లోకి లేకుండా పోయింది. అప్పుడప్పుడు అవార్డ్స్ ఫంక్షన్స్ లో మెరిసే అను.. అసలు ఈమధ్యన కనబడడమే మానేసింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి వార్తల్లోకి వచ్చిన అను ఇమ్మాన్యువల్ గ్లామర్ షో చేసి దెబ్బతిన్నా అంటుంది. కథల విషయంలో చేసిన పొరబాటు వలన తన కెరీర్ దెబ్బతిందని వాపోతుంది. అందమున్నా.. గ్లామర్ షో చేసినా… లక్ లేకపోవడం అను ని దెబ్బకొట్టింది. అయితే కేవలం కథల విషయంలో ద్దృష్టి పెట్టనందుకే తనకు ఈ గతి పట్టిందని సన్నిహితులకు చెప్పి తెగ ఫీల్ అవుతుందట అను ఇమ్మాన్యువల్. ప్రస్తుతం అవకాశాలు లేని ఆమెకి ఏదో ఒకటి తగిలి మళ్ళీ ఫామ్ లోకి రాకపోతానా అని నమ్మకంతో టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా టాక్. అందుకే సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని హాటెస్ట్, గ్లామర్ ఫోటో షూట్స్ కి తెర లేపాలనే ఆలోచన చేస్తుందట అను.