అను అతిగా ఆలోచిస్తోందా..?

నానితో కలిసి డీసెంట్ గా మజ్ను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అను ఇమ్మాన్యువల్ మొదటి సినిమా మజ్ను కాదు… గోపీచంద్ ఆక్సీజెన్ సినిమానే అనుకి మొదటి [more]

;

Update: 2019-03-29 07:43 GMT
anu emmanuel next movies
  • whatsapp icon

నానితో కలిసి డీసెంట్ గా మజ్ను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అను ఇమ్మాన్యువల్ మొదటి సినిమా మజ్ను కాదు… గోపీచంద్ ఆక్సీజెన్ సినిమానే అనుకి మొదటి సినిమా. కానీ ఆక్సిజెన్ కన్నా ముందే మజ్ను విడుదలైంది. అయితే ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేసిన అను ఇమ్మాన్యువల్ కి వరుస ఫ్లాప్స్ ఆమె కెరీర్ కి దెబ్బేసాయి. గత ఏడాది అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజ అల్లుడు సినిమాల ఫ్లాప్స్ తో మళ్లీ సినిమా అవకాశాలేమీ అనుకి రాలేదు. ఒక పక్క పర్సనల్ ప్రోబ్లెమ్స్, మరో పక్క కెరీర్.. అను ఇప్పుడు అవకాశాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి. తెలుగులో, తమిళంలో కూడా పెద్దగా క్లిక్ అవని అను ఇమ్మాన్యువల్ చేసిన సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే. అందుకే తాజాగా తనకొచ్చే పాత్రల విషయంలో అను ఆచితూచి అడుగులు వేస్తుంది. రీసెంట్ గా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేసింది అను.

తప్పు తెలుసుకుందట…

తాజాగా అను ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి అంతగా క్రేజ్ రాకపోవడానికి కారణం.. కెరీర్ ఆరంభంలోనే తాను అనవసరమైన గ్లామర్ పాత్రలకు ప్రాముఖ్యతనివ్వడం వల్ల అని చెప్పింది. కథ గురించి తెలుసుకోకుండా పాత్రలు ఒప్పుకోవడం వలన కూడా తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పింది. అందుకే ఈసారి కథ మొత్తం విని అందులోని తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే సినిమా ఒప్పుకోవాలని నిర్ణయానికి అను వచ్చిందట. మరి ఎంత టాప్ హీరోయిన్ అయినా ఆమె పాత్రకి తగ్గ కథ చెప్పే డైరెక్టర్ ఆమెని సినిమాలోకి తీసుకుంటాడు కానీ పూర్తి కథ చెప్పి హీరోయిన్ ని తీసుకోడు. అలాంటప్పుడు అను కాస్త అతిగా ఆలోచిస్తుందేమో అనిపించడం లేదూ.

Tags:    

Similar News