టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్

నేడు అనుపమ పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్ మెంట్స్ టిల్లు స్క్వేర్ లో..;

Update: 2023-02-18 10:40 GMT
anupama parameswaran, tillu square

anupama parameswaran

  • whatsapp icon

ఎలాంటి అంచనాలు లేకుండా.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో.. హీరో క్యారెక్టర్ లో చూపించిన ఆటిట్యూడ్, డైలాగ్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. డీజే టిల్లు హిట్టవ్వడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో.. నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా.. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తోంది.

నేడు అనుపమ పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్ మెంట్స్ టిల్లు స్క్వేర్ లో ఆమె లుక్ ను విడుదల చేసింది. అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి.. మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో అనుపమ నోస్‌ పిన్‌ పెట్టుకుని అందంగా కనిపిస్తూ.. ‘రాధిక’ క్యారెక్టర్ ని గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.


Tags:    

Similar News